#avinashmohite #hyderabadnews #holicelebration #breakingnews #kaizernews
రంగులు కాదు కేసులు పడతాయి జాగ్రత్త.! Commissioner Avinash Mohanty on Holi Celebrations ||@KaizerNewsTelugu
హైదరాబాద్ నగరంలో హోలీ పండుగ సందర్భంగా పోలీసులు పలు ఆంక్షలు విధించారు. హోలీ పండుగ సందర్భంగా రోడ్లపై గుంపులుగా చేరడం, ఇతరులపై బలవంతంగా రంగులు చల్లడం, ర్యాలీల చేయడం పూర్తిగా నిషేధించారు. ఈ సంవత్సరం హోలీ పండుగ ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో, అదీ శుక్రవారం రోజున జరగనుండటంతో మతసామరస్యాన్ని కాపాడేందుకు పోలీసులు ముందస్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మార్చి 14 ఉదయం 6 గంటల నుంచి 15 ఉదయం 6 గంటల వరకు, మొత్తం 24 గంటల పాటు నగరంలో పలు ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. నిబంధనలు అతిక్రమించే వారిపై పబ్లిక్ న్యూసెన్స్ కింద కేసులు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
రోడ్లపై గుంపులుగా తిరగడం, బహిరంగ ప్రదేశాల్లో బలవంతంగా ఇతరులపై రంగులు వేయడం చేయరాదని పోలీసులు స్పష్టం చేశారు . ఇలాంటి చర్యలు శాంతిని భంగం చేసే అవకాశం ఉన్నందున, ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీస్ విభాగం ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేస్తోంది.
మరోవైపు, హోలీ రంగులతో ఇబ్బంది పడే వారు, ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, మహిళలు ఇంట్లోనే ఉండాలని సూచించారు. ప్రజలందరూ తమ తమ ఆనందాన్ని వ్యక్తీకరించేటప్పుడు ఇతరుల స్వేచ్ఛకు, మతాభిప్రాయాలకు గౌరవం ఇవ్వాలని, హోలీని శాంతియుతంగా జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Follow us for real-time updates:
Instagram: @kaizernews_telugu
コメント